వందిత శుభగుణశాలీ మానవ - మోచక! దయాంబురాశీ! (2)
అగణిత దూత ప్రణుతా! పతితావన!
అగణిత దూత ప్రణుతా! పతితావన!
వందిత శుభగుణశాలీ మానవ-మోచక! దయాంబురాశీ! (2)
1. ఆది పాప శాపంబుగ ధరపై - ముళ్ళనొసగి మాక్రూర కరములకు (2)
నినుహింసించెడి మార్గము చూపితే - మా కొరకే యా శిక్ష భరించితే
నాదు యేసువా! నాటి యెహోవా....!
భళిరే! దౌర్భాగ్య నరులపై - నీదు కృపా బాహుళ్యమింతయా!
అగణిత దూత ప్రణుతా! పతితావన! (2) ||వందిత||
2. నాకపు ఘన మందిరపు నివాసము - కన్నపతిత ప్రక్షాళిత మానవ (2)
హృదియే ఘనమని.. మము దయ గంటివే - మము నీ మహిమాలయముగ జేసితే
నాదు యేసువా! నాటి యెహోవా! భళిరే!
నిర్భాగ్యనరులపై నీ కరుణా దాతృత్వమింతయా..!
అగణిత దూత ప్రణుతా! పతితావన! (2) ||వందిత||
No comments:
Post a Comment