Home

▼

16 February 2023

Aasha theera naa yesu swaamini ఆశ తీర నా యేసు స్వామిని

 
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆత్మతో సత్యముతో స్తుతించెదను
ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ||
 
దుప్పి నీటికై ఆశపడునట్లుగా
దేవుని కొరకై ఆశ పడుచున్నాను
దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత||
 
లోక ఆశలు లయమైపోవును
లోకులెవ్వరు కాపాడలేరు
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)
లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Post a Comment