Home

▼

02 November 2022

Prardhana vinnavayya vijayam | ప్రార్ధన విన్నావయ్యా విజయం


ప్రార్ధన విన్నావయ్యా - విజయం నిచ్చావయ్యా (2)
తొట్రిల్ల నియ్యలేదు - తోడుండి నడిపించావు (2)  

పొగడెద పాటపాడి - పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా (2)
తండ్రి దేవా మంచివాడా - నిరంతరం గొప్పవాడా (2)
నిరంతరం గొప్పవాడా (2)  

కన్నీరు చూసావయ్యా - కరం పట్టి నడిపావయ్యా (2)
విన్నపం విన్నావయ్యా - విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||  

ఎబినేజర్ నీవేనయ్యా  సహాయం చేసావయ్యా (2)
ఎల్రోయి నీవేనయ్యా - నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద||  

నిన్నే నమ్ముకొనెదన్ - నీపై ఆనుకొనెదన్ (2)
శాంతి నొసగువాడా - నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||

No comments:

Post a Comment