Home

▼

24 October 2022

Yevvanuda yevvanuda matimatiki | యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి

యవ్వనుడా యవ్వనుడా
మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు?
యవ్వనుడా యవ్వనుడా
నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు?

దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా
వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము
యేసయ్యను స్వీకరించి వెంబడించుము
అపజయమే ఎరుగక సాగిపోవుము

అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము
ఇతరులకొక మాదిరిగా జీవించుము
పాపమనే చీకటిలో ఉన్నవారిని
నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము

యవ్వనుడా యవ్వనుడా
ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా

No comments:

Post a Comment