Home

Sharanukoriyuntini nee Siluvanu | శరణుకోరియుంటిని నీ సిలువను

శరణుకోరియుంటిని నీ సిలువను - నీ చరణములే చేరియుంటిని 
శరణుకోరియుంటిని నీ సిలువను
నీ త్యాగమును వివరించుటకు (2)
ఏ పదములు చాలవు నా యేసయ్యా ||శరణు||

1.వధకు తేబడిన గొర్రెపిల్లవోలె - దీనుడవై సిలువకు అప్పగించుకొంటివి (2)
విసర్జింపబడితివి తృణీకరించబడితివి (2)
పాపులకై ప్రాణమును అర్పించితివయ్యా (2) ||శరణు||

2.పాపభారమంతా సిలువలో మోసితివి - రోగములన్నిటినీ నీవే భరియించితివి (2)
వ్యాధినొందినవానిగ వ్యసనాక్రాంతునిగా (2)
కనిపించినావయ్య ఆ సిలువలో (2) ||శరణు||

3.బాధింపబడినను నోరు తెరువలేదు - దౌర్జన్యము నొందినను ఎదురు తిరుగలేదు (2)
శత్రువులను సిలువలో క్షమించినావు నీవు (2)
తిరుగుబాటుదారులకై విజ్ఞాపన చేసితివి (2) ||శరణు|| 

రచన స్వరకల్పన: జాన్ కెనడి బేతపూడి 
సంగీతం: వినయ్ కుమార్
గానం: హరిణి

No comments:

Post a Comment