కన్యకను - నేనేలాగుచూచుదును?
కన్యకను చూచి - ఉన్నతస్థలమందు ఉన్న
నా స్వాస్థ్యమును - నేనేల పోగొట్టుకొందును?॥నా కన్నులతో॥
అ.ప: నిబంధన నిబంధన - నా కన్నులతో నిబంధన
నే మహిమలోచేరువరకు - నీ వాక్యమును చూడాలనే నా నిబంధన
1. గొడ్రాలి గర్భమునుండి - న్యాయాధిపతిగా మారిన సమ్సోను
కన్నులతో నిబంధనను - నిర్లక్ష్యము చేసెను అదనుచూచి అపవాది - దెలీలాను కన్నులముందు ఉంచగా
పాపము మానలేని కన్నులుగలవాడై - ఆమె సౌందర్యమునకు ముగ్ధుడైపోయెను ॥నా కన్నులతో ॥
2. స్వల్పమైన గోత్రములోని - పరాక్రమశాలురైన బెన్యామీనీయులు -
కన్నులతో నిబంధనను - నిర్లక్ష్యము చేసిరి
అదనుచూచి అపవాది పరుని భార్యను కన్నులముందు ఉంచగా
పాపము మానలేని కన్నులుగలవారై - ఆమెను నీచపరచి హీనముగ చంపిరి ||నా కన్నులతో||
3. గొఱ్ఱెల దొడ్డినుండి - రాజ్యసింహాసనమెక్కిన దావీదు
కన్నులతో నిబంధనను - నిర్లక్ష్యము చేసెను అదనుచూచి అపవాది - బతెబను కన్నులముందు ఉంచగా
పాపము మానలేని కన్నులుగలవారై - ఆమె సౌందర్యమునకు లోబడిపోయెను ॥నా కన్నులతో॥
No comments:
Post a Comment