Home

Kaluvari prema na neramulenchani | కలువరి ప్రేమ నా నేరములెంచని

కలువరి ప్రేమ - నా నేరములెంచని ప్రేమ
విడువని ప్రేమ - ఎన్నడు మరువని ప్రేమ
నా బాధలో నెమ్మది - నా బ్రతుకులో పెన్నిధి (2)
ఆ ప్రేమ నీవే కదా - నా స్వాస్థ్యము నీవేనయా (2)॥కలువరి॥

1.తల్లిదండ్రుల ప్రేమ - బంధుమిత్రుల ప్రేమ
గతించిపోవునుగా - హద్దులే లేని ప్రేమ (2)
ప్రాణమే - ఒసగిన ప్రేమ - పాపములన్నియు కడిగే ప్రేమ 
ఆ ప్రేమ నీవేకదా - నా స్వాస్థ్యము నీవేనయ్యా (2)॥కలువరి॥

2.ఇహలోక ప్రేమలు - దేవుని ప్రేమతో సాటిరావుగా (2)
నాతోడు వచ్చే ప్రేమ - నిత్యము నిలిచే ప్రేమ 
ఆదియు అంతము - మారని ప్రేమ (2)
ఆ ప్రేమ నీవే కదా -నా స్వాస్థ్యము నీవేనయ్యా (2)॥ కలువరి ॥

3.సిలువలో చేసిన - నీ రక్త అర్పణే మమ్ము రక్షించెనుగా (2)
స్వస్థతను ఇచ్చే రక్తం - జయమును కలిగించును రక్తం
పరమపురి సీయోనుకు - చేర్చే రక్తం (2)
ఆ రక్తం నీవే కదా - నా స్వాస్థ్యము నీవేనయా ॥కలువరి॥

No comments:

Post a Comment