610 ఆరాధన ముగింపు
రా - భీంప్లాస్ తా - త్రిపుట
ప్రభువా మమ్మునుదీవించి - పంపుము నీ కృప నందించి అభినందన ములఁ జేకొనుమా - విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్॥ప్రభువా॥
1. పగతురఁ బ్రేమించెడు శక్తిన్ - తగఁబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ - జగదేక కుమారా కీర్తి - యుగయుగములకు నీ కగుతన్ చేయుము ॥ప్రభువా
2. గుడిలో వినిన నీవాక్యము మా - గుండెలఁ బదిలము జేయఁగను గుడిబయటను నా చారములో - నడువగఁ దోడ్పడుమో కీర్తి యుగయుగము - లకు నీ కగుతన్ ॥ప్రభువా॥
3. క్రైస్తవ మైత్రిని సంఘములో - విస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ భావము లోకములో - నెరపఁగ దయఁగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ॥ప్రభువా||
- మొలతాటి విద్యానందము
No comments:
Post a Comment