నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా...
నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము - నేనూహించలేను యేసయ్యా..(2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా - నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీకృప||
1. మహిమను విడిచి - మహిలోకి దిగివచ్చి - మార్గముగా మారి - మనిషిగ మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి - మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద - మహిమగ మార్చింది నీకృప (2) యేసయ్యా(2) ||నీ కృప||
2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి - ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింపజేసి - ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశతీర ఆరాధన చేసే - అదృష్టమిచ్చింది నీ కృప (2) యేసయ్యా(2) ||నీ కృప||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment