Home

▼

08 December 2021

Yehova Na Kaapari Naaku | యెహోవ నా కాపరి నాకు లేమి

యెహోవ నా కాపరి - నాకు లేమి కలుగదు 
పచ్చికగల చోట్లలో ఆయన నన్ను పరుండ జేయుచున్నడు 
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు చున్నాడు 
నా ప్రాణమునకు ఆయనా సేదదీర్చుచున్నాడు
తన నామమునుబట్టి నీతిమార్గములలో 
నన్ను నడిపించుచున్నాడు

నా శత్రువుల యెదుట నీవు నాకు 
భోజనము సిద్ధ పరచుదువు 
నూనెలో నా తల అంటియున్నావు 
నా గిన్నె నిండి పొర్లుచున్నది 
నేను బ్రతుకు దినములన్నియు 
కృపాక్షేమములే నా వెంట వచ్చున్ 
చిరకాలము యెహోవా మందిరములో 
నే నివాసము చేసెదను 

No comments:

Post a Comment