Home

▼

06 November 2021

అధికమైన విజయము



🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪ నేటి దిన ధ్యానము ⛪

 ✝️*అధికమైన విజయము*✝️

మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
 రోమా. 8:37

ప్రేమకును, విజయమునకును అనుకున్నంత దగ్గర సంబంధము గమనించలేము. ఎందుచేతనంటే ప్రేమ ఉన్నా లేకపోయినా ప్రేమించినట్లుగా నటించగలము. కానీ విషయము అంతగా సాధ్యము కాదు. ఎంతగానో పోరాడవలసియుంది. అంతే కాదు, శత్రువును గాని మరి ఏ విషయములోనైనా గాని, పరీక్షల్లో గాని విజయము సాధించాలంటే చెప్పినంత సులభముగా విజయము పొందలేము. అయితే అపో" పౌలు అనుభవ పూర్వకముగా, సువార్త పత్రిక గా మారిపోయిన తర్వాత యేసయ్యలోని నిస్వార్థ ప్రేమను, దీర్ఘశాంతమును కృపాకనికరములను, అనుభవించిన వ్యక్తిగా, కేవలం సమస్త మానవాళిని కృప చేత రక్షించిన యేసయ్య ప్రేమ ద్వారానే ప్రేమించబడిన పొందగలము అని బోధిస్తున్నాడు. నీ జీవితములో నీవు ఎటువంటి అపజయములు ఎదుర్కొని నను, శత్రువుతో పోరాడ వలసి వచ్చినను, నిస్వార్థ ప్రేమను కనబరచిన యేసయ్య ద్వారానే అత్యధిక విజయం పొందగలవు. యేసయ్య నీ జీవితంలో లేకపోతే ఆయన ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఏదీ సాధించలేవు. నీకు నీవుగా ఏదీ సాధించలేవు. అదే యేసయ్య నీలో ఉన్నట్లయితే నీ జీవితం అంతా విజయమే. యేసును ప్రేమించ లేని జీవితం అపజయము కాని యేసు ప్రేమించిన నీ జీవితం అత్యధిక *విజయం పొందగలరు*. అంటే స్పష్టమైన విజయం సంపాదించుకోవడానికి దేవుని కృప నీకు తోడైయుండును గాక!


🛐 *ప్రార్ధన*🛐
 ఓ దేవా! అధికమైన విజయముతో నన్ను నింపి నా జీవితమును ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

No comments:

Post a Comment