Home

Neeti Vaagula Koraku | నీటి వాగుల కొరకు


నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2)
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా(2)

1. పనికిరాని నను నీవు పైకి లేపితివి - 
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి(2)
నా అడుగులు స్థిరపరచి - బలము నిచ్చితివి (2)
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
ఇలలో వెంబడింతు ప్రభూ  ||నా ప్రాణమ||

2.ఆంధకారపు లోయలలో నేను నడిచినను -
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి(2)
కంటిపాపగ నీవు - నన్ను కాచితివి (2)
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Post a Comment