Home

Avadhule Lenidhi Divyamaina | అవధులేలేనిది దివ్యమైన

అవధులేలేనిది దివ్యమైన నీకృప 
అనంతమైనది ఆశ్చర్యమైనది (2) 
యేసయ్యా నాపై నీవు చూపిన కృప 
అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులేలేనిది||

1. ఊహించలేని హృదయానందమును
దు:ఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారమెక్కువైన తీరము కడుదూరమైన
నీపై ఆనుకొందును నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులేలేనిది||

2. సరిపోల్చలేని మధురమైన అనుభవం
వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
నీరూపము తలచుకొందును - 
నేను నీకోసమే వేచియుందును (2) ||అవధులేలేనిది||

3. లెక్కించలేని అగ్నిశోధనలో
ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
వాడబారని కిరీటము నే పొందుటకు -
వెనుకున్నవి మరచి నేను లక్ష్యమువైపు సాగెద (2) ||అవధులేలేనిది||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Post a Comment