Home

Neethigala yehova | నీతిగల యెహోవా స్తుతి

5
దైవ స్తుతి
రా - నవరోజు,    తా - త్రిపుట

నీతిగల యెహోవా స్తుతి మి - యాత్మతో నర్పించుడి - మియాత్మతో సేవించూడి = దాతయౌ మన క్రీస్తు నీతిని - దాల్చుకొని సేవించుడి ||నీతి||

1.¹చదల బుడమియు రవియు జలధియు - నదులు  గిరులును జక్కగా = ²సదమలంబగు దైవ నామము - సర్వదా నుతిజేయను ||నీతి||

2.సర్వశక్తుని కార్యముల కీ - సర్వరాష్ట్రము లన్నియు = గర్వములు విడి తలలు వంచుచు - నుర్విలో నుతి జేయను ||నీతి||

3.గీత  ³తాండవ వాద్యముల చే - బ్రీతి పరచెడు సేవతో = పాతకంబులు పరిహరించెడు - దాతనే  సేవించుడి ||నీతి||

4.పరమదూతలు నరులు పుడమిని - మొదలు బెట్టుచు దేవుని = పరము నందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు ||నీతి||

5.ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని = వెలయు స్తుతి వే నోళ్లతోడను - విసుగు జెందక జేయుడి ||నీతి||

6.ఆత్మ  నీవిక మేలుకొని శు - ద్ధాత్మ యేసుని దండ్రిని = త్రిత్వమగునా యేక దేవుని - హర్షమున  సేవింపవే ||నీతి||
                              - పసుపులేటి దావీదు
________________________________
¹ఆకాశము. ²పరిశుద్ధము. ³నాట్యము.
DOWNLOAD MP3 SONG HERE 👇