నీవు మారాలని మనసు మార్చాలని
నీ కొరకై ప్రాణమిచ్చేను ప్రభువు
తండ్రిని చేరాలని తల్లడిల్లిన గానీ
తనువు నీకై బలి అయిపోయెను యేసు
ఇది అర్థంమయినదా ఓ క్రైస్తవుడా..
ఇది వ్యర్థమైనదా ఓ క్రైస్తవుడా..
1.ఎన్నోమాటలువిన్న - ఎన్నో పనులు చేసిన
ఎంతో ధనముఇచ్చిన మారుమనసు ఉన్నదా కొండెపు మాటలతోటి మనిషిని గాయపరుచుట
హృదయముదుఃఖ పెట్టుట దేవుడు కోరుకున్నదా
అన్నీ తెలిసిన నీవు ఇన్ని తప్పులు చేస్తే
నీకు మార్పు లేదని ప్రభువు తెలుపుచున్నాడు
2.ఎన్నో ఆలోచించి ఎన్నో బోధలు చేసి
చెప్పిన నీవు చేయక తప్పులు చేస్తేన్యాయమా ?
పైన గొర్రె చర్మము లోనా తోడేలు స్వభావం
కలిగి నీవు ఉండుట కన్న తండ్రికిష్టమా ...
కష్టనష్టాలైనా , శ్రమలు బాధలు అయిన
ఇష్టము తో చేయడమే దేవుడు కోరుకున్నది
Lyrics & Tunes: Br . P. Srinivas Garu
Music: Br. Paul Sudarshan Garu
Vocals : ShylajaNuthan
No comments:
Post a Comment