Home

Kalyana ragala sandhadilo| కళ్యాణ రాగల సందడిలో

కళ్యాణ రాగల సందడిలో - ఆనంద హరివిల్లులో -
మల్లెల పరిమళ జల్లులో - కోయిల గానాలలో (2)
పరిశుద్ధుడేసుని సన్నిధిలో - నవదంపతులు ఒకటవ్వగా (2)

స్వాగతం వధువ స్వాగతం - స్వాగతం వరుడ స్వాగతం..
నీ పతిన్ చేరగా నవ వధువా స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం..
స్వాగతం వధువ స్వాగతం - స్వాగతం వరుడ స్వాగతం..

1.నరుడు ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండమేలని - 
ఇరువురి కలయిక దేవుని చిత్తమై - ఒకరికి ఒకరు నిలవాలని (2)
తోడుగా.. అండగా.. ఒకరికి ఒకరు నిలవాలని (2) ||స్వాగతం||

2.సాటిలేని సృష్టి కర్త - సాటిఐన సహాయము - 
సర్వ జ్ఞానిఐన దేవుడు - సమయోచితమైన జ్ఞానముతో (2)
సమకూర్చెను సతిపతులను - ఇది అన్నిటిలో ఘనమైనది (2) ||స్వాగతం||

No comments:

Post a Comment