Home

Yesuni sweekarinchu | యేసుని స్వీకరించు క్రీస్తేసుని

యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు 
నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము - తానే ప్రవేశించును

1. కనికరమందైశ్వర్యుండు - నిన్ను వాత్సల్యముతో విమోచించును
భయంకరమైన పాపమునుండి - విడిపింపనిన్ను వెదకి వచ్చెన్

2. మన్నించు సర్వపాపంబులన్ - తానె మాన్పును సర్వరోగములన్
కృపకనికరముల మకుటము నీకు - ధరియింపజేసి ఘనపరచున్

3. అంధులకు దృష్టి కలుగజేసి - అంగహీనులను లేపి నడువజే సెన్
పలువిధములగు వ్యాధిగ్రస్తులకు - స్వస్థతనిచ్చెను తక్షణమే

4. పాపభారమును భరియించెన్ - నీ రోగములన్నిటి తొలగించెన్
సహించెను కొరడా దెబ్బల బాధలు -
జయించెను అన్ని శోధనలస్

5. కలువరి సిలువలో వ్రేలాడి - తన రక్తము చిందించే ధారలుగా
చేతులలో తన కాళ్ళల సీలలు - ముండ్ల కిరీటము ధరియించె

6. జీవమిచ్చుటకు ప్రాణమిడి - మరి జయించెను ప్రతివిధశోధనలు
నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడె నిను రక్షింప

No comments:

Post a Comment