కన్నులుండి చూడలేవ యేసు మహిమను -
చెవులుండి వినలేవ యేసు మాటను (2)
నాలుకుండి పాడలేవ యేసు పాటను -
కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి||
చెడును చూడకుండ నీ కనులను -
చెడును పలుకకుండ నీ నాలుకన్ (2)
చెడును వినకుండ నీ చెవులను -
చెడులో నడువకుండ నీ కాళ్ళను (2)
దూరముగా నుంచు ఓ సోదరా -
దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి||
దుష్టుల ఆలోచన చొప్పునా -
నడువక సాగుమా నీ యాత్రలో (2)
పాపుల మార్గమందు నీవు నిలువక -
అపహాసకులు కూర్చుండు చోటను (2)
కూర్చుండకుమా ఓ సోదరా -
కూర్చుండకుమా ఓ సోదరీ (2) ||కన్నులుండి||
యెహోవా దొరుకు కాలమందునా -
ఆయనను మీరు వెదక రండి (2)
ఆయన మీ సమీపమందు నుండగా -
ఆయననూ మీరు వేడుకొనండి (2)
ఆయన తట్టు తిరుగు ఓ సోదరా -
ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2) ||కన్నులుండి||
__________________________
Kannulundi Chudaleva Yesu Mahimanu
Chevulundi Vinaleva Yesu Matanu (2)
Naalukundi Padaleva Yesu Patanu
Kaallu Undi Naduvaleva Yesu Batanu ||Kannulundi||
Chedunu Chudakunda Nee Kanulanu -
Chedunu Vinakunda Nee Chevulanu (2)
Chedunu Palukakunda Nee Naalukan -
Chedulo Naduvakunda Nee Kaallanu (2)
Duramugaa Nunchu O Sodara -
Duramugaa Nunchu O Sodaree (2) ||Kannulundi||
Dushtula Aalochana Choppuna -
Naduvaka Sagumaa Nee Yathralo (2)
Paapula Maargamandu Neevu Niluvaka -
Apahaasakulu Kurchundu Chotanu (2)
Kurchundakumaa O Sodara -
Kurchundakumaa O Sodaree (2) ||Kannulundi||
Yehovaa Doruku Kaalamanduna -
Aayananu Meeru Vedaka Randi (2)
Aayana Mee Sameepamandu Nundaga -
Aayananoo Meeru Vedukonandi (2)
Aayana Thattu Thirugu O Sodara -
Aayana Thattu Thirugu O Sodaree (2) ||Kannulundi||
No comments:
Post a Comment