Home

Vachi gabriyelu palkenu | వచ్చిగాబ్రియేలు పల్కెను

106      దూత మరియను దర్శించుట
రా - ఆనంద భైరవి                 తా - త్రిపుట

     వచ్చిగాబ్రియేలు పల్కెను - మరియ - ¹మచ్చకంటిడెంద ²ముల్కెను = హెచ్చైన శుభముల - ³నెనలేని కృప దేవుఁ డిచ్చి ⁴యింతులలోని - న్నెచ్చు జేయునటంచు ||వచ్చి||

1. భయ మాత్మలో వీడు కన్యకా నీవు - దయబొంది యున్నవు ధన్యగా = ⁵రయముగ నిదిగోగ - ర్భముఁ దాల్చెదవు ⁶పుత్రో - దయమౌ యేసను పేర - తని కిడు మంచును ||వచ్చి||

2. అతఁడెన్నఁబడును మహాత్ముడై - సర్వో - న్నతుఁడైన దైవకుమారుఁడై = హిత మొప్పు దేవుండు - న్నతిఁ జేసి దావీదు - ⁷వితత సింహాసన - మతని కిచ్చునంచు ||వచ్చి||

3. ఘనతరుఁడగు వాని రాజ్యము - అంత - మొనగూడ దది నిత్యపూజ్యము = ⁸వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు - కొను నాతఁ డనుంచుఁ దె - ల్పెను దూత మరియతో ||వచ్చి||
                              - పురుషోత్తమ చౌదరి
________________________________
¹స్త్రీ. ²ఉలికిపడెను. ³సాటిలేని. ⁴స్త్రీలలో . ⁵శీఘ్రముగ. ⁶కుమారుఁడు పుట్టెను. ⁷వెడల్పైన. ⁸స్తుతింపబడదగినది.

No comments:

Post a Comment