Home

Shudha rathri saddhanamga | శుద్ధరాత్రి సద్ధణంగ నందఱు

128       Silent night, Holy night

1. శుద్ధరాత్రి! సద్ధణంగ - నందఱు నిద్రపోవ 
శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ - బరిశుద్ధుఁడౌ బాలకుఁడా! 
దివ్య నిద్ర పొమ్మా - దివ్య నిద్ర పొమ్మా.

2. శుద్ధరాత్రి! సద్దణంగ - దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకుఁ దెలిపెను - ఎందు కిట్టులు పాడెదరు? 
 క్రీస్తు జన్మించెను - క్రీస్తు జన్మించెను.

3. శుద్ధరాత్రి! సద్దణంగ - దేవుని కొమరుఁడ! 
నీ ముఖంబున బ్రేమ లొల్కు - నేఁడు రక్షణ మాకు వచ్చె 
నీవు పుట్టుటచే - నీవు పుట్టుటచే.
                                     - జోసెఫ్ మోర్

No comments:

Post a Comment