Home

Seethakalamlo christmas | శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో

శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో
చివుకు లేదు చింత లేదు
చాల సంతోషం
బాధ లేదు భయము లేదు
భలే ఆనందం
హాపి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్

యాకోబుల నక్షత్రం ఉదయించెను
తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను
బెత్లెహేములో యేసుని చూసి
కానుకలిచ్చెను నాడు
ఆరాధించి ఆనందించి
యేసుని చాటెను చూడు

పొలమందు కాపరులకు దూత చెప్పెను
రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు
పశువుల తొట్టిలో ప్రభువుని చూసి
పరవశం మొందనివారు
అవి విన్నవాటిని ప్రచురం చేసి
మహిమ పరచెను చూడు

No comments:

Post a Comment