Home

Na korkai kalvarilo nee pranam | నా కొరకై కల్వరిలో నీ ప్రాణం

నా కొరకై కల్వరి లో నీ ప్రాణం ఇచ్చిన దేవా 
నా కొరకై సిలువలో బలిఅర్పణముగా మిగిలితివా
నా యేసయ్య .... నా ప్రాణ నాధుడా 
నా యేసయ్య .... నా రక్షణ దుర్గమా ||నా కొరకై||

నేను చేసిన పాపము కొరకై - నీ చేతికి మేకులు వేసితిరా 
నేను చేసిన దోషము కొరకై - నీ ముఖమున ఉమ్మి వేసితిరా 
నీ ప్రాణం ఇచ్చితివయ్య నన్ను రక్షించుటకొరకై 
నీ జీవమిచ్చితివయ్యా నన్ను కాపాడుట కొరకై ||నా కొరకై||

నేను చేసిన నేరము కొరకై - నిన్ను బాధ పెట్టితిరయ్యా
నేను చేసిన క్రోధము కొరకై - నిన్ను గాయము చేసితిరయ్యా 
నీ బలము నిచ్చితివయ్యా నన్ను బలపరచుట కొరకై
నీ రక్షణనిచ్చితివయ్యా నీ సేవ చేయుట కొరకై ||నా కొరకై||
              రచన, స్వరకల్పన, గానం: సుగుణ

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Post a Comment