122
క్రీస్తుని మహిమ
రా – మాద్యమావతి, తా – అట
లాలి లాలి లాలమ్మ లాలీ - లాలియని పాడరే - బాలయేసునకు ||లాలి||
1.పరలోక దేవుని తనయుఁడో యమ్మా - పుడమిపై బాలుఁడుఁగఁ - బుట్టెనో యమ్మా ||లాలి||
2.ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ - మహి పాలనముఁ - జేయు మహితుఁడో యమ్మా ||లాలి||
3.ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా - ఆదాము దోషమున - కడ్డు పడె నమ్మా ||లాలి||
4.యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా - యూదు లాతని తోడ - వాదించి రమ్మా ||లాలి||
5.నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా - గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ||లాలి||
– తిరువళ్ళూరి స్టీవెన్
No comments:
Post a Comment