Home

Neevu Leni Chotedi Yesayya | నీవు లేని చోటేది యేసయ్యా

నీవు లేని చోటేది యేసయ్యా - నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా - కనుమరుగై నేనుండలేనయ్యా (2)
నీవు వినని మనవేది యేసయ్యా - నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని||

1. కయీను కౄర పగకు బలియైన హేబేలు
రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే
నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే||

2. సౌలు ఈటె దాటికి గురియైన దావీదు - 
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు -
సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే
నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Post a Comment